బుధవారం 03 మార్చి 2021
Crime - Jan 24, 2021 , 13:01:40

సూరత్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసుల మృతి

సూరత్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసుల మృతి

హైదరాబాద్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు హైదరాబాద్‌ వాసులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాది నదీ జలాల కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు గుజరాత్‌ వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును సూరత్‌ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అడిక్‌మెట్‌ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్‌, పాన్‌బజార్‌ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమణ అక్కడిక్కడే మరణించారు. ఈవో సత్యనారణ, పూజారి వేంకటేశ్వర శర్మ, క్లర్క్‌ కేశవరెడ్డి గాయపడ్డారు. పోలీసులు వారిని అహ్మదాబాద్‌లోని హోప్‌ దవాఖానకు తరలించారు. 


కాగా, ఈ ప్రమాద ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేశాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ను ఆదేశించారు.  

VIDEOS

logo