సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 09:09:41

సూర్యాపేటలో లారీ, కారు ఢీ.. ఇద్దరి మృతి

సూర్యాపేటలో లారీ, కారు ఢీ.. ఇద్దరి మృతి

సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చివ్వెంల మండలంలోని కాశీంపేట వై జంక్షన్‌ వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

లారీ విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నదని, వెనుక నుంచి వచ్చిన కారు.. లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం దవాఖానకు తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉన్నదని వెల్లడించారు. గాయపడినవారిలో ఒక మహిళ ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదుచేశారు.logo