శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 17:12:35

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖపట్నం: జిల్లాలోని జి.మాడుగుల మండలం సాడేకు గ్రామం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొయ్యురు నుంచి నుర్మతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహానంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  తెలిపారు 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo