మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 12:34:15

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వికారాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ అదుపుతప్పి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గేటు సమీపంలో జరిగింది. మృతులు ధారూరు సురేందర్ (40), ఎల్‌ అండ్‌ టీ కంపెనీ సంగారెడ్డిలో హెవీ మోటర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తాండూర్ మండలం సిరిగిరిపేట గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ (38) అదే కంపెనీలో ఫస్ట్ ఎయిడర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo