మంగళవారం 02 జూన్ 2020
Crime - Feb 25, 2020 , 18:52:27

పోలీసు వాహనం ఢీకొని ఇద్దరు మృతి..

పోలీసు వాహనం ఢీకొని ఇద్దరు మృతి..

వరంగల్‌ రూరల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారు. రాయపర్తి మండలం, తిర్మలయ్యపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు చూసినైట్లెతే.. ఇద్దరు దంపతులు తమ కుమార్తెతో కలిసి బైక్‌పై నందనంకొండూరు వెళ్తున్న సమయంలో.. పాలకుర్తి సీఐ వెళ్తున్న ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించగా.. వారి కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


logo