గురువారం 04 మార్చి 2021
Crime - Jan 21, 2021 , 16:24:07

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్‌, లాయర్‌ మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్‌, లాయర్‌ మృతి

ఖమ్మం : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తుపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ (45) మృతి చెందారు. సత్తుపల్లి కోర్టులో పని పూర్తి చేసుకుని ఖమ్మంకు కారులో వస్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో సత్యనారాయణ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో దంత వైద్యుడు కిరణ్ కుమార్ (35) మృతి చెందాడు. కిరణ్ కుమార్ ఖమ్మం నుంచి ఇల్లందుకు మోటార్ సైకిల్ పై వస్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అదుపు తప్పి పడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

కుల వృత్తులకు రూ.1,000 కోట్లతో చేయూత

హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన

చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!

రేగిపండు ఎందుకు తినాలి.. ఎవరెవరు తినాలి..? 

తెలంగాణ భవన్‌ నిర్మాణ పనుల పరిశీలన

VIDEOS

logo