శనివారం 11 జూలై 2020
Crime - May 17, 2020 , 12:16:44

ఆటోను డీకొన్న టిప్పర్‌.. ఇద్దరు మృతి

ఆటోను డీకొన్న టిప్పర్‌.. ఇద్దరు మృతి

మెదక్‌: జిల్లాలోని నర్సాపూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను టిప్పర్‌ డీకొట్టింది. దీంతో నర్సాపూర్‌కి చెందిన గోని శ్రీహరి, రుస్తుంపేట గ్రామానికి చెందిన బోయిని నరసింహులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా చేపలు అమ్ముతారని, ఆటోలో హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన చేపలను దించుతుండగా టిప్పర్‌ వచ్చి దాన్ని గుద్దిందని పోలీసులు వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


logo