ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 19:09:06

‘మహువా మద్యం’ సేవించి ఇద్దరు మృతి

‘మహువా మద్యం’ సేవించి ఇద్దరు మృతి

కొర్బా : ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాలో మహువా (ఇప్ప) పూలతో తయారు చేసిన మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన బాకిమోంగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్గిఖర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. 

అటారీ కోర్బి గ్రామానికి చెందిన పర్సాది యాదవ్ (40) తన బంధువులైన తిజ్రామ్ సాహు (35) రాజేశ్‌ యాదవ్‌(34)లను కలవడానికి శుక్రవారం బాల్గిఖర్ గ్రామానికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం ముగ్గురు కలిసి బాల్గిఖర్‌ సమీపంలోని ధాప్డాప్ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న మహువా (ఇప్ప)పూలతో తయారు చేసిన మద్యాన్ని కొనుగోలు చేసి సేవించారు. 

కాసేపయ్యాక ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కొంతమంది స్థానికులు గుర్తించి వారిని జిల్లా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పర్సాది, తిజ్రామ్ మృతి చెందగా రాజేశ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ సూపరింటెండెంట్ కేఎల్ సిన్హా శనివారం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo