మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 11:58:18

స్నానానికి కాల్వలో దిగి ఇద్దరు మృతి

స్నానానికి కాల్వలో దిగి ఇద్దరు మృతి

షాజహన్‌పూర్ : కాల్వలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతై మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం, షాజహన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నోగామా జస్వంతపూర్‌ గ్రామానికి చెందిన నాన్హే సింగ్ (30), మాన్ సింగ్ (28) స్థానికంగా ఉన్న కాల్వలో స్నానానికి దిగారు. ఇంతలో నీటి ప్రవాహం పెరుగడంతో ఇద్దరు కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం జరుగ్గా మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. logo