మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 22:39:08

నదిలో వాహనం బోల్తా.. కనిపించకుండా పోయిన ఐటీబీపీ జవాన్లు

నదిలో వాహనం బోల్తా.. కనిపించకుండా పోయిన ఐటీబీపీ జవాన్లు

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా స్పిల్లో సమీపంలో సట్లెజ్ నదిలో వాహనం బోల్తాపడి ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు గల్లంతయ్యారని జిల్లా అధికారి అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై రెకాంగ్ పియో నుంచి డువ్లింగ్ పోస్టుకు ఐటీబీపీ వాహనం బయల్దేరింది. 10.30 గంటల సమయంలో స్పిల్లో సమీపంలోకి రాగానే అదుపుతప్పి సట్లెజ్‌ నదిలో పడిపోయిందని కిన్నౌర్ పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఆర్ రానా తెలిపారు. ప్రమాదం తరువాత హిమాచల్‌ ప్రదేశ్‌ బిలాస్‌పూర్ జిల్లా గుర్మార్విన్‌ ప్రాంతానికి చెందిన వాహన డ్రైవర్ ప్రదీప్, అరుణాచల్ ప్రదేశ్‌లోని దండూబ్ ప్రాంతానికి చెందిన రైఫిల్మన్ నీమా కనిపించకుండా పోయారు. వీరి ఆచూకీ గాలించేందుకు 17వ బెటాలియన్‌కు చెందిన పోలీసులు, ఐటీబీపీ జవాన్లు రంగంలోకి దిగారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్ కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo