సూర్యాపేట: జిల్లాలోని కోదాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రమాద జరిగినప్పుడు బస్సులో 39 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..