గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 24, 2020 , 19:11:54

గంజాయి విక్రేత‌లు ఇద్ద‌రు అరెస్టు

గంజాయి విక్రేత‌లు ఇద్ద‌రు అరెస్టు

హైద‌రాబాద్ : గ‌ంజాయి అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ విభాగం అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి 38.5 కేజీల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను న‌గరంలోని దూల్‌పేట‌కు చెందిన‌ విశాల్ సింగ్‌(26), ద‌ర్మేంద‌ర్ అలియాస్ ద‌మ్ము గా గుర్తించారు. ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ ఎన్ అంజిరెడ్డి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. విశాల్ సింగ్ ఇంటిపై ఎక్సైజ్ సిబ్బంది రైడ్ చేసి గంజాయిని ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. కేజీకి రూ. 4 వేల చొప్పున కొత్త‌గూడెం డ్రైవ‌ర్స్ కాల‌నీకి చెందిన స‌మ‌ద్ యాకూబ్ పాషా గంజాయిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు చెప్పారు. కొనుగోలు చేసిన గంజాయిని విశాల్ కేజీ రూ. 6 వేల చొప్పున విక్ర‌యిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విశాల్ నుంచి కొనుగోలు చేసిన వ్య‌క్తులు 10 గ్రాములు రూ. 100 చొప్పున విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపారు. 


logo