ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 17:00:44

కాంట్రాక్ట‌ర్ హ‌త్య కేసులో ఇద్ద‌రు అరెస్ట్

కాంట్రాక్ట‌ర్ హ‌త్య కేసులో ఇద్ద‌రు అరెస్ట్

హైద‌రాబాద్ : లేబ‌ర్ కాంట్రాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ గౌస్(45) హ‌త్య కేసులో హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను శుక్ర‌వారం అరెస్టు చేశారు. గౌస్ ను ల‌క్ష్మారెడ్డి పాలెంలోని ఫంక్ష‌న్ హాలు వ‌ద్ద మంగ‌ళ‌వారం హ‌త్య చేసిన విష‌యం విదిత‌మే.

అరెస్టు అయిన నిందితుల‌ను మ‌హ్మ‌ద్ స‌మీర్(24), జిలానీ రెహ‌మాన్(31)గా గుర్తించారు. స‌మీర్ గౌస్ కు మేన‌ల్లుడు. అయితే స‌మీర్ రెండో వివాహం చేసుకునేందుకు గౌస్ ను రూ. 2 ల‌క్ష‌లు అడిగాడు. ఇందుకు గౌస్ కూడా ఒప్పుకున్నాడు. కానీ కేవ‌లం రూ. 50 వేలు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో ఇరువురి మ‌ధ్య ప‌లుమార్లు గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి. గౌస్ ను చంపాల‌ని స‌మీర్ నిర్ణ‌యించుకున్నాడు.

ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం రాత్రి గౌస్ కు స‌మీర్ మ‌ద్యం పార్టీ ఇచ్చాడు. ఇక జిలానీ స‌హాయంతో గౌస్ పై క‌త్తుల‌తో దాడి చేసి చంపాడు. జిలానీకి కూడా గౌస్ తో శ‌త్రుత్వం ఉంది. 

గౌస్ హ‌త్య‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. నిందితులిద్ద‌రిని రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు.


logo