ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 30, 2020 , 16:13:23

హ‌వాలా మ‌నీ రాకెట్ బ‌హిర్గ‌తం.. ఇద్ద‌రు అరెస్టు

హ‌వాలా మ‌నీ రాకెట్ బ‌హిర్గ‌తం.. ఇద్ద‌రు అరెస్టు

హైద‌రాబాద్ : హ‌వాలా రాకెట్‌ను బ‌హిర్గ‌త ప‌రిచిన పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ. 31 ల‌క్ష‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కాచిగూడ‌లో హ‌వాలా మ‌నీ రాకెట్‌ను ఛేదించింది. అరెస్టు చేసిన వారిని పాత‌బ‌స్తీకి చెందిన మనీష్ తోష్నివాల్, విష్ణు బిరాదార్‌గా గుర్తించారు. ఎటువంటి సంబంధిత ప‌త్రాలు లేకుండానే వీరు న‌గ‌దును త‌ర‌లిస్తున్నారు. త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం నిందితుల‌ను, స్కూట‌ర్‌ను సుల్తాన్ బ‌జార్ పోలీసుల‌కు అప్ప‌గించారు. 


logo