శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 11:13:42

సహోద్యోగిపై లైంగిక దాడి.. వీడియో తీసి బెదిరింపులు

సహోద్యోగిపై లైంగిక దాడి.. వీడియో తీసి బెదిరింపులు

షామ్లీ : సహోద్యోగిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసి తరచూ బెదింపులకు పాల్పడుతున్నారు. వేధింపులు తారాస్థాయికి చేరడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులిద్దరూ ఊచలు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా కంధ్లా పట్టణంలో ఓ ఇంటర్ కాలేజీకిలో పని చేస్తున్న మహిళపై అక్కడే పని చేసే ఇద్దరు ఉద్యోగులు లైంగిక దాడి చేశారు. దీనిని వీడియో తీసి తరచూ బెదిరిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని  స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కర్మవీర్ సింగ్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo