శనివారం 16 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 17:08:02

కోడి పందాలు నిర్వ‌హిస్తున్న ఐదుగురి అరెస్టు

కోడి పందాలు నిర్వ‌హిస్తున్న ఐదుగురి అరెస్టు

వ‌రంగ‌ల్ : కోడి పందాలు నిర్వ‌హిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హ‌స‌న్‌ప‌ర్తి ప‌రిధిలోని జ‌య‌గిరి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. కోడి పందాలు నిర్వ‌హిస్తున్నార‌న్న విశ్వ‌స‌నీయ స‌మాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బి. నందిరామ్‌, మ‌ధు సిబ్బందితో క‌లిసి రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. నాలుగు పందెం కోళ్ల‌తో పాటు సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రూ.3,260 న‌గ‌దు, నాలుగు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను దేవ‌ర‌కొండ రాములు, దేవ‌ర‌కొండ భిక్ష‌ప‌తి, యాకుబ్ పాషా, ఓని సుధాక‌ర్‌, స‌య్య‌ద్ మౌలాలిగా గుర్తించారు.