సోమవారం 13 జూలై 2020
Crime - Feb 07, 2020 , 18:07:46

ఉరివేసుకుని ఇద్దరు యువతుల ఆత్మహత్య

ఉరివేసుకుని ఇద్దరు యువతుల ఆత్మహత్య

హయత్‌నగర్‌లో పీఎస్‌ పరిధి రాఘవేంద్రనగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో పీఎస్‌ పరిధి రాఘవేంద్రనగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. డిగ్రీ చదువుతున్న యువతులు గౌతమి, మమత గదిలో సూసైడ్‌ చేసుకున్నారు. మరో పది రోజుల్లో మమతకు వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈలోపే స్నేహితులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. పెళ్లికి భారీగా కట్నకానుకలు ఇవ్వాల్సి వస్తుందని,  తల్లిదండ్రులకు భారమైపోయామని యువతులు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ యువతి సూసైడ్‌ నోట్‌లో వెల్లడించింది.   యువతుల ఆత్మహత్యలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.  


logo