e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో విద్యుత్‌షాక్‌తో ఇద్ద‌రు మృతి

వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో విద్యుత్‌షాక్‌తో ఇద్ద‌రు మృతి

వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో విద్యుత్‌షాక్‌తో ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్ : వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. మంచిర్యాల‌, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గురువారం ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండ‌లం కొమ‌టిచేను గ్రామంలో రామ్‌టెంకి శంక‌ర్‌(53) అనే వ్య‌క్తి విద్యుదాఘాతానికి గురై చ‌నిపోయాడు. గ్రామ స‌మీపంలోని వ్య‌వ‌సాయ‌బావిలో విద్యుత్ వైర్ల‌తో చేప‌లు ప‌ట్టేందుకు స్నేహితుల‌తో కలిసి వెళ్లాడు. కాగా ఈ క్ర‌మంలో క‌రెంట్‌షాక్‌కు గురై శంక‌ర్ మృతిచెందాడు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు కొడుకులు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేర‌కు పోలీసులు మృతుడి స్నేహితులు స‌తీశ్‌, లింగ‌య్య‌పై కేసు న‌మోదు చేశారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం బ‌ట్‌ప‌ల్లి గ్రామంలో సుంకె మాధ‌వి(30) క‌రెంట్ షాక్‌కు గురై చ‌నిపోయింది. ఎయిర్‌కూల‌ర్‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న విద్యుత్‌వైర్ ద్వారా క‌రెంట్ షాక్‌కు గురై చనిపోయింది. మృతురాలికి భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో విద్యుత్‌షాక్‌తో ఇద్ద‌రు మృతి

ట్రెండింగ్‌

Advertisement