మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 22, 2020 , 19:40:33

పెండ్లికి వెళ్తుండగా కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

పెండ్లికి వెళ్తుండగా కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

నిజామాబాద్‌ : కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం కుకునూరు క్రాస్‌రోడ్‌ వద్ద చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవీన్‌-లావణ్య, రాజశేఖర్‌-రవళి దంపతులు కారులో నిజామాబాద్‌ పట్టణంలో జరిగే పెండ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. జాతీయ రహదారి-63పై ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మొక్కజొన్న లోడ్‌తో ఉన్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌ శ్రీనివాస్‌, నవీన్‌ భార్య లావణ్య సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. రాజశేఖర్‌ ఈయన భార్య రవళి గాయపడ్డారు. వేల్పూరు పోలీసులు మృతదేహాలను, గాయపడ్డ వ్యక్తులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.