శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 17:11:11

ఎన్‌హెచ్‌-65పై కారు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

ఎన్‌హెచ్‌-65పై కారు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

న‌ల్ల‌గొండ : జాతీయ ర‌హ‌దారి 65పై ఈ ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. న‌ల్ల‌గొండ జిల్లా క‌ట్టంగూర్ స‌మీపంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. రోడ్డు ప్ర‌క్క‌గా ఆపిన డీసీఎం వ్యానును ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న అభి(30), రేణుక(28) అనే ఇద్ద‌రూ ప్ర‌మాద స్థ‌లంలోనే మృతిచెందారు. మ‌రోక వ్య‌క్తి కృష్ణ త‌ల‌కు గాయ‌మైంది. వీరంతా హైద‌రాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన‌వారు. విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం భారిన ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న క‌ట్టంగూరు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డ్డ బాధితుడిని నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అల‌స‌త్వం, అధిక‌వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా పోలీసులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo