సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 08:50:06

ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్ ఎక్స్‌ రోడ్ వద్ద శనివారం  తెల్లవారుజమున 2.20 గంటల సమయంలో  ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. కారు ముందుభాగం ట్యాంకర్‌ కిందికి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.


logo