ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 28, 2021 , 09:34:02

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి విద్యుత్‌ తీగలు తెగి కారుపై పడ్డాయి. దీంతో కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గోకవరం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

VIDEOS

logo