గురువారం 21 జనవరి 2021
Crime - Dec 12, 2020 , 10:52:01

గజ్వేల్‌లో బస్సు, బైకు ఢీ.. ఇద్దరు మృతి

గజ్వేల్‌లో బస్సు, బైకు ఢీ.. ఇద్దరు మృతి

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గజ్వేల్‌ మండలంలోని జాలిగామ శివారులో ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపోలు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మంద ప్రసాద్‌, ఎర్రోళ్ల డేవిడ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. 


logo