ఆదివారం 25 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 11:32:21

భార్యాభర్తలు సజీవ దహనం.. అనాథగా కూతురు

భార్యాభర్తలు సజీవ దహనం.. అనాథగా కూతురు

పుదుచ్చేరి : పుద్దుచ్చేరిలోని అరియాన్‌కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో పటాకులు తయారు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించి దంపతులు సజీవ దహనమయ్యారు. అరియాన్‌కుప్పం ప్రాంతంలో అనుమతి లేకుండా నెపోలియన్‌ అనే వ్యక్తి భార్య పద్మతో కలిసి ఇంట్లో పటాకులు తయారు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పటాకుల తయారీ ముడిపదార్థాలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటలు వ్యాపించి భార్యాభర్తలకు అంటున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. తీవ్ర గాయాలైన దంపతులను పుదుచ్చేరి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కూతరు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. ఘటనపై అరియాన్‌ కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo