శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 21:07:00

మ‌ట్వాడా పీఎస్ కానిస్టేబుళ్లు ఇద్ద‌రు స‌స్పెండ్‌

మ‌ట్వాడా పీఎస్ కానిస్టేబుళ్లు ఇద్ద‌రు స‌స్పెండ్‌

వ‌రంగ‌ల్ అర్బ‌న్‌ : జిల్లాలోని మ‌ట్వాడా పోలీస్ స్టేష‌న్‌కు చెందిన ఇద్ద‌రు కానిస్టేబుళ్లు అవినీతికి పాల్ప‌డిన కార‌ణంగా పోలీసు క‌మిష‌న‌ర్ పి. ప్ర‌మోద్ కుమార్‌ విధుల నుండి తాత్కాలికంగా తొల‌గించారు. దొంగిలించిన బైక్‌ల‌ను కొనుగోలు చేస్తున్న వ్య‌క్తుల నుండి వీరు అక్ర‌మంగా డ‌బ్బులు వ‌సూలు చేసినందుకుగాను క‌మిష‌న‌ర్ శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు గురువారం ఉత్త‌ర్వులు వెలువ‌రించారు. జీ. మ‌హేంద‌ర్‌, ఓ. రాజు అనే ఇద్ద‌రు కానిస్టేబుళ్లు మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూర్ మండ‌లం గ‌ట‌ట్ఇక‌ల్లు గ్రామానికి చెందిన వ్య‌క్త‌ల వ‌ద్ద నుంచి రూ. 20 వేలు లంచం తీసుకున్నారు. అవినీతికి పాల్ప‌డిన ప్ర‌తీఒక్క‌రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు మిగ‌తా పోలీసు సిబ్బందికి ప్ర‌మోద్ కుమార్‌ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.


logo