అనుమానాస్పదంగా చిన్నారుల మృతి

తెలకపల్లి (నాగర్‌కర్నూల్): అనుమానాస్పద స్థితిలో సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని గడ్డంపల్లిలో జరిగింది. నాగర్‌కర్నూల్ సీఐ గాంధీ నాయక్, తెలకపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గడ్డంపల్లికి చెందిన తలుపునూరు తిరుమలయ్య, భాగ్యలక్ష్మీ దంపతులకు కిట్టు(5) అమ్ములు (3) ఇద్దరు సంతానం. మంగళవారం సాయంత్రం తిరుమలయ్య అన్న అగు లక్ష్మయ్య ఇంటి ఎదుట ఉన్న సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
దీంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరు చిన్నారులు ఒకే దగ్గర మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, చిన్నారుల మృతదేహాలను నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హై హై.. నాయకా
- పంటల కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ నిఖిల సమీక్ష
- రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలి
- జనగామ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలి
- స్టేషన్‌ఘన్‌పూర్ ఠాణాను తనిఖీ చేసిన డీసీపీ
- సెన్సెక్స్ ఢమాల్
- బ్యాంక్ లాకర్లో చెద పురుగులు
- గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
- మెట్ట పంటలకు అనువైన సమయమిది