ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 12:26:08

ప్రమాదవశాత్తు నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ప్రమాదవశాత్తు నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

బార్పేట : అసోంలోని బార్పేట జిల్లాలో శనివారం ఇద్దరు పిల్లలు నదిలో మునిగి చనిపోయారు. వివరాలు.. జిల్లాలోని కల్గాచియా రెవెన్యూ సర్కిల్ పరిధిలోని బార్విటాలోని వారి ఇళ్ల సమీపంలోని నది వద్ద ఇద్దరు చిన్నారులు షరీఫుల్ ఇస్లాం (4), రబియా ఖాతున్ (2) ఆడుకుంటున్నారు. ఆడుతూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి పోయారు. అక్కడే చేపలు పడుతున్న కొందరు నదిలోకి దిగి చిన్నారులను బయటికి తీయగా అప్పటికే మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బార్పేట మెడికల్ కళాశాల దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo