బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 21:50:49

కంటిచూపు కోల్పోయిన మ‌హిళ‌లు.. వైద్యుడిపై కేసు

కంటిచూపు కోల్పోయిన మ‌హిళ‌లు.. వైద్యుడిపై కేసు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పంజాగుట్ట‌లో గ‌ల ఓ కంటి ద‌వాఖానా వైద్యుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కంటి ఆప‌రేష‌న్ అనంత‌రం ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌మ చూపును కోల్పోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స‌ద‌రు వైద్యుడిపై ఐపీసీ సెక్ష‌న్ 338 కింద కేసు న‌మోదు చేశారు. హైద‌రాబాద్‌లోని దోమ‌ల‌గూడ‌కు చెందిన కె. క‌ళావ‌తి(65), డి. ప‌ద్మ(72) అనే మ‌హిళ‌లు త‌మ కంటికి శ‌స్ర్త చికిత్స చేయించుకున్నారు. కాగా ఆప‌రేష‌న్‌ విక‌టించడంతో స‌ద‌రు మ‌హిళ‌లు చూపును కోల్పోయారు. 


logo