మంగళవారం 02 జూన్ 2020
Crime - Feb 22, 2020 , 12:37:51

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

వరంగల్‌ రూరల్‌: ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సంగెం మండలం, గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని పరిశీలించారు. అనంతరం, పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.  


logo