ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 10:38:12

పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : సాగు కోసం కొన్న కాడెద్దులు ప్రకృతి ప్రకోపానికి బలైన విషాద ఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి బండారి రవి అనే రైతుకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దులు విలువ సుమారు రూ. లక్ష 50 వేల ఉంటుందని రైతు తెలిపాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తాజావార్తలు


logo