శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 07:41:09

అన్నదమ్ముల దారుణ హత్య..

అన్నదమ్ముల దారుణ హత్య..

నల్లగొండ : అనుముల మండలం హజారిగూడెం గ్రామంలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి అనే ఇద్దరు సోదరులను ఇంటి ఎదుట ఆరుబయట నిద్రిస్తుండగా మంచాల్లోనే అర్ధరాత్రి గొడ్డళ్లతో నరికి చంపారు. వీరి మరో సోదరుడు హరిపై కూడా దాడి జరగ్గా.. తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరిగ్గా సంవత్సరం క్రితం అక్రమ సంబంధం నేపథ్యంలో హజారిగుడెం శివారులో ఓ యువకుడి హత్య జరిగింది.

మృతుల కుటుంబాలకు చెందిన ఓ మహిళతో ఆ యువకుడికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే అప్పట్లో హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఆ యువకున్ని హత్య చేసిన కేసులో ప్రస్తుతం మృతులు ఇద్దరితో పాటు వారి మరో సోదరుడు హరి కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన ఈ ముగ్గురు అన్నదమ్ములు కొంతకాలం కిందట బెయిల్‌పై విడుదలయ్యారు. ఊరిలో ఉంటుండగా, ఈ క్రమంలోనే గతంలో హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు వీరి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

ఊరిలోనే ఉంటున్నారన్న సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి హత్యకు పథకం వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. యువకుడి తల్లి మరో ఇద్దరి సాయంతో గ్రామానికి చేరుకుని అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒకేసారి గొడ్డళ్లు, కత్తులతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముగ్గురిని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లుగా దాడి జరిగిన తీరును బట్టి అర్థం అవుతోంది. దాడిలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే చనిపోగా, మరో సోదరుడు హరి తప్పించుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo