సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 16:41:08

రాఖీ క‌ట్టిన రోజే అక్క‌ను చంపిన త‌మ్ముళ్లు

రాఖీ క‌ట్టిన రోజే అక్క‌ను చంపిన త‌మ్ముళ్లు

అహ్మ‌దాబాద్ : రాఖీ క‌ట్టిన రోజే త‌మ అక్క‌ను ఇద్ద‌రు త‌మ్ముళ్లు క‌లిసి క‌త్తితో పొడిచి చంపారు. ఆ త‌ర్వాత ఆమె ఇంట్లో బంగారంను దొంగిలించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని స‌రిత రెసిడెన్సీలో ఆగ‌స్టు 4వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

అహ్మ‌దాబాద్‌కు చెందిన సౌకీ అనే మ‌హిళ‌కు స‌జిజూల్ షేక్‌, రోజౌలీ షేక్ అనే ఇద్ద‌రు త‌మ్ముళ్లు ఉన్నారు. సౌకీకి గ‌తంలో పెళ్లి కాగా అత‌ను చ‌నిపోయాడు. దీంతో మ‌ళ్లీ రెండో పెళ్లి చేసుకుంది. రెండో భ‌ర్త రామ్‌స్వ‌రూప్ సాధుతో క‌లిసి స‌రిత రెసిడెన్సీలో ఉంటుంది.

అయితే రాఖీ పండుగ సంద‌ర్భంగా సౌకీ ఇంటికి ఆగ‌స్టు 4వ తేదీన ఇద్ద‌రు త‌మ్మ‌ళ్లు వ‌చ్చారు. రాఖీ క‌ట్టిన త‌ర్వాత‌.. త‌మ్ములిద్ద‌రూ క‌లిసి ఆమెపై క‌త్తితో దాడి చేసి చంపారు. ఆ త‌ర్వాత ఇంట్లో ఉన్న రూ. 6 ల‌క్ష‌ల విలువ చేసే బంగారం, వెండి వ‌స్తువుల‌ను అప‌హ‌రించారు. 

అక్క‌ను ఎందుకు చంపాల్సి వ‌చ్చిందంటే..

త‌మ అక్క‌ను ఎందుకు చంపాల్సి వ‌చ్చిందో పోలీసుల విచార‌ణ‌లో వారిద్ద‌రూ చెప్పారు. స‌జిజూల్‌కు పెళ్లి అయింది. అయితే కొద్ది రోజుల‌కే భార్య‌తో విడాకులు తీసుకున్నాడు స‌జిజూల్‌. తాను విడాకులు తీసుకోవ‌డానికి సోద‌రి సౌకీనే కార‌ణ‌మ‌ని స‌జిజూల్ భావించాడు. ఈ క్ర‌మంలో ఆమెపై అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ప‌గ పెంచుకున్నారు. ఆగ‌స్టు 2వ తేదీన ఇద్ద‌రు క‌లిసి ప‌థ‌కం వేశారు. ఆ ప‌థ‌కం ప్ర‌కారం సోద‌రిని చంపిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో ఒప్పుకున్నారు. 


logo