బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 18:37:11

చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి.. సంగారెడ్డి జిల్లాలో విషాదం

చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి.. సంగారెడ్డి జిల్లాలో విషాదం

సంగారెడ్డి : చేపల వేటే వారి పాలిట మృత్యువైంది. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఆ బాలురు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని  ఝరాసంగం మండలం పొట్టిపల్లి శివారులో చోటు చేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. చేపల పెంపకం కోసం నిర్మించిన ఊట చెరువులో పడి మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (10) విశాల్ బాబు (11) అనే ఇద్దరు బాలురు చెందారన్నారు. ఇద్దరు బాలురు మృతి చెందటంతో వారి కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo