సోమవారం 03 ఆగస్టు 2020
Crime - Jun 25, 2020 , 13:40:44

విశ్రాంత ఉద్యోగి హత్యకేసులో ఇద్దరి అరెస్టు

విశ్రాంత ఉద్యోగి హత్యకేసులో ఇద్దరి అరెస్టు

కడప: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన విశ్రాంత ఉద్యోగి దారుణ హత్యను కడప పోలీసులు ఛేదించారు. జిల్లాలోని యర్రగుంట్ల గ్రామంలో  నీటిపారుదల శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన  వెంకటరమణ  మొండెం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముసలయ్య ఇంట్లో లభించింది.

విచారణ చేపట్టిన పోలీసులు  కడప సమీపంలోని చెరువులో తలను పడేసినట్లు ముసలయ్య అంగీకరించడంతో చెరువులో తలను స్వాధీనం చేసుకున్నారు.  ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని  సంవత్సరకాలంగా నిలదీస్తున్నందుకే ముసలయ్య తన బంధువైన శ్రీనాథ్‌తో కలిసి వెంకటరమణను హత్య చేశాడని గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. ఆర్థిక లావాదేవిల కారణంగా దారుణ హత్యకు పాల్పడ్డారని అన్నారు.ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 


logo