శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 01, 2020 , 13:15:19

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

ములుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇదరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..ములుగు మండలం పందికుంట గ్రామం వద్ద ఒడిషా రాష్ట్రానికి చెందిన  సోమనాథ్,  జయరాం అనే ఇద్దరు వ్యక్తులు 54 కిలోల గంజాయిని పందికుంట గ్రామానికి చెందిన గోడ తిరుపతి అనే వ్యక్తికి విక్రయించేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ములుగు ఏఎస్పీ సాయి చైతన్య ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo