శనివారం 16 జనవరి 2021
Crime - Oct 28, 2020 , 22:52:29

మెగా క్యాంపులో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన ఇద్ద‌రి అరెస్టు

మెగా క్యాంపులో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన ఇద్ద‌రి అరెస్టు

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం సర్కిల్ అంతర్గo పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి మెగా క్యాంపు ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి రూ. 20 లక్షలను కొల్ల‌గొట్టిన కేసులో పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. మెగా కంపెనీ పీఆర్‌వో మూర్తి నారాయణ పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దొంగతనానికి పాల్ప‌డిన వ్యక్తులను కతిరా మాఫీ గ్రామం, శ్రావస్తి జిల్లా ఉత్తరప్రదేశ్ కి చెందిన వారీగా గుర్తించారు. రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ కరుణాకర్ రావు, అంతర్గo ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది రాజేందర్‌తో కలిసి నేపాల్ స‌రిహ‌ద్దు దగ్గర సుమారు 1800 కిలోమీట‌ర్లు ప్రయాణించి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ. లక్ష రికవరీ చేయడం జరిగింది. దొంగతనానికి పాల్ప‌డింది మొత్తం ముగ్గురు కాగా వీరిలో పోలీసులు ఇద్ద‌రిని ప‌ట్టుకున్నారు. పట్టుకొన్నవారిని రామగుండం తీసుకువ‌చ్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. పరారీలో ఉన్న మ‌రో నిందితున్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ వెల్ల‌డించారు.