గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 09, 2020 , 06:59:32

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

హైదరాబాద్‌ : టీవీ నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ మధునగర్‌లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలం క్రితం ఓ యువకుడు ఆమెకు టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయం అయ్యాడు. అయితే సదరు యువకుడు తరుచూ శ్రావణిని డబ్బులు ఇవ్వమంటూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగి, వాటిని బయటపెడుతానని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బంధువులు ఆరోపించారు. వేధింపులు అధికం కావడంతో ఇటీవల ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌లో నటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo