శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 20:39:47

బైకును లారీ ఢీకొని.. తల్లీకుమార్తె పైనుంచి దూసుకెళ్లి..

బైకును లారీ ఢీకొని.. తల్లీకుమార్తె పైనుంచి దూసుకెళ్లి..

బరేలీ : లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో తల్లీకుమార్తె దుర్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లో  లఖింపూర్ ఖేరి జిల్లా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ధౌరాహ్రా ప్రాంతంలో నివసించే శౌదా (30), కుమార్తె అల్ఫిసా (4) సోదరుడు షైదాతో కలిసి బైకుపై వెళ్తుండగా నిఘాసన్‌ ప్రాంతం సమీపంలో ట్రక్కు ఢీకొనడంతో శౌరదా, అల్ఫిసా బైకు పైనుంచి కిందపడ్డారు. లారీ వీరి మీదనుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బైక్‌ నడుపుతున్న షైదా స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రక్ డ్రైవర్ ఘటనా స్థలంలోనే వాహనాన్ని వదిలి పరారయ్యాడు. వాహనం ఫైజాబాద్ జిల్లాలో రిజిస్టర్ అయిందని, త్వరలోనే డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్ నరేంద్ర సింగ్ తెలిపారు. లిఖితపూర్వక ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo