శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 14:38:27

80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం.. ట్రక్‌ డ్రైవర్‌ అరెస్టు

80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం.. ట్రక్‌ డ్రైవర్‌ అరెస్టు

రాజ్‌కోట్ : గుజరాత్‌లో పైశాచిక ఘటన జరిగింది. 80 ఏండ్ల ముసలావిడపై ట్రక్‌ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చీరతో గొంతు బిగించి హతమార్చేందుకు యత్నించాడు. ద్వారకా జిల్లా ఓఖా మండల్ తాలూకా సూరజ్‌కరాడి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలు కుటుంబీకులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాత్రి స్థానిక బస్టాండ్‌లో కూర్చుంది.

అటుగా వచ్చిన సంలాసర్ గ్రామానికి చెందిన జస్రాజ్‌భా మానేక్ (40) వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చీరతో గొంతు బిగించి హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడికి కొవిడ్‌-19 పరీక్ష అనంతరం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు మిథాపూర్‌ పోలీసులు తెలిపారు. మానేక్‌ ట్రక్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo