శనివారం 23 జనవరి 2021
Crime - Dec 02, 2020 , 18:07:01

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

మేడ్చల్‌-మల్కాజిగిరి : రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని అవుషాపూర్‌ గ్రామానికి చెందిన మండల టీఆర్‌ఎస్‌ నాయకుడు డొంకెని శ్రీకాంత్‌ గౌడ్‌ మృతి చెందాడు. దీంతో అవుషాపూర్‌ గ్రామంలో  విషాదచాయలు అలుముకున్నాయి. ఘట్‌కేసర్‌ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అవుషాపూర్‌ గ్రామానికి చెందిన జిల్లా రైతు బంధు సభ్యుడు‌ డొంకెని భిక్షపతి గౌడ్‌ పెద్ద కుమారుడు డొంకెని శ్రీకాంత్‌గౌడ్‌(36) మంగళవారం రాత్రి ఘట్‌కేసర్‌ నుంచి ద్విచక్రవాహనం(బుల్లెట్‌) పై వస్తుండగా.. అవుషాపూర్‌ గ్రామంలో గ్రీన్‌ బావర్చి హోటల్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన అటో ఢీకొట్టింది. 

దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.  మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, శ్రీకాంత్‌ గౌడ్‌ మరణ వార్త తెలుసుకున్న మంత్రి చామకూర మల్లారెడ్డి, బాధిత కుటుంబాన్ని పరమార్శించి ధైర్యం చెప్పారు. 


logo