బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 10:24:56

భారీగా నిషేధిత బ్రాండ్‌ దగ్గు టానిక్‌ సీసాలు స్వాధీనం

భారీగా నిషేధిత బ్రాండ్‌ దగ్గు టానిక్‌ సీసాలు స్వాధీనం

అగర్తలా : త్రిపురా రాష్ట్రం చంద్రపూర్ ప్రాంతంలో ట్రక్‌లో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎస్కాఫ్ బ్రాండ్‌కు చెందిన 1,000 దగ్గు టానిక్‌ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా ట్రక్కును తనిఖీ చేయగా నిషేధిత దగ్గు సిరప్‌ సీసాలు కనిపించాయని సదర్ సబ్ డివిజన్ పోలీసు అధికారి సశ్వత్ కుమార్ తెలిపారు. దీంతో ట్రక్కును సీజ్‌ చేసి డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

గురువారం ఇక్కడి శాంతిపారా ప్రాంతంలో డ్రగ్స్‌ రవాణా చేసే వ్యక్తి ఇంటి నుంచి యాబా టాబ్లెట్లు, బ్రౌన్ షుగర్, రూ .13 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న 48 గంటల లోపు మత్తుకోసం వినియోగించే టానిక్‌ సీసాలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. మాదక ద్రవ్యాలు, మానసిక ఉత్ప్రేరక పదార్ధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo