ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Feb 24, 2021 , 06:42:46

యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రమాదం.. ఏడుగురి మృత్యువాత

యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రమాదం.. ఏడుగురి మృత్యువాత

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాతి మధుర యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై 68 మైలురాయి సమీపంలో బోల్తాపడ్డ ట్యాంకర్‌ను ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ ట్యాంకర్‌ నోయిడా నుంచి ఆగ్రా వైపు వస్తోంది. ఈ క్రమంలో టైర్‌ పేలడంతో అదుపు తప్పి మరోమార్గంలో బోల్తాపడింది. ఈ క్రమంలో ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఇన్నోవా వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మృతులు హర్యానాలోని జింద్‌ వాసులని, మనోజ్ (45), అతని భార్య బబితా (40), కుమారులు అభయ్ (18), హేమంత్ (16), హిమాంగి (14), మను (10), డ్రైవర్ రాకేశ్ (39)గా గుర్తించారు. బోల్తాపడ్డ ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇన్నోవా నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృత్యువాతపడగా.. మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కట్టర్‌ను వినియోగించి మృతదేహాలను అందులో నుంచి బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతమైన రక్తసిక్తమైంది. ప్రమాదస్థలిని ఎస్పీ దేహాత్‌ శ్రీచంద్‌ సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

VIDEOS

logo