వరంగల్లో విషాదం.. అక్కాతమ్ముళ్లను బలిగొన్న కుటుంబ కలహాలు

వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలంలో కుటుంబ కలహాలు అక్కాతమ్ముళ్లను బలిగొన్నాయి. పురుగుల మందు తాగి తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా తమ్ముడు చనిపోయాడన్న భయంతో అక్కా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నక్కలపల్లి గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలివి.. గ్రామానికి చెందిన మహ్మద్ రబ్బాని (43)ని అతడి అక్క సైదా పక్కపక్క ఇండ్లలోనే ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య కలహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనైన రబ్బాని సోమవారం మధ్యాహ్నం పురుగుల మందుతాగాడు. కుటుంబీకులు గుర్తించి చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్లోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. తమ్ముడు చనిపోయాడన్న భయంతో అక్క సైదా (45) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇదే కుటుంబంలో మరొకరు కూడా ఆత్యహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దవాఖాన వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ