శుక్రవారం 05 జూన్ 2020
Crime - Mar 04, 2020 , 20:16:16

వికారాబాద్‌ జిల్లాలో విషాదం..

వికారాబాద్‌ జిల్లాలో విషాదం..

వికారాబాద్‌: కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. జిల్లాలోని, తాండూర్‌ మండంలం, గుండలమడుగు తండాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో తగాదా పడ్డాడు.  తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. తండా శివారులోని ఓ చెట్టుకు తన ఇద్దరు అబ్బాయిలకు ఉరి వేసి, అనంతరం తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. మృతదేహాలను చెట్టుపై నుంచి కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు. కాగా, కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఒకేసారి మరణించడంతో.. తండాలో విషాదం చోటుచేసుకుంది.  


logo