బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 25, 2020 , 17:10:19

వనపర్తి జిల్లాలో విషాదం..తాత, మనుమడు దారుణ హత్య

వనపర్తి జిల్లాలో విషాదం..తాత, మనుమడు దారుణ హత్య

వనపరిత్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెబ్బేరు మండలం వై.శాఖాపూర్ గ్రామంలో తాత, మనమడు దారుణ హత్యకు గురయ్యారు. పొలం విషయంలో పంచాయితీ తలెత్తడంతో పంచాయితీ జరుతుండగా.. దాయాది పరశురాములు గువ్వల పాపయ్య (55), గువ్వల రామకృష్ణ(25)పై కత్తితో దాడి చేసి చంపాడు. దాడిలో పాపయ్య  అక్కడికక్కడే మృతి చెందగా రామకృష్ణను దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. చాలా ఏండ్లుగా దాయాదుల మధ్య భూతగాదాలు కొనసాగుతున్నాయి. పొలం వద్దే పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కొనసాగుతుండగా పరశురాములు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితున్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.logo