శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 11:15:01

సూర్యాపేట జిల్లాలో విషాదం..కొడుకును చంపిన తండ్రి

సూర్యాపేట జిల్లాలో విషాదం..కొడుకును చంపిన తండ్రి

సూర్యాపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన బండగొర్ల శ్రీశైలం నిన్న రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తండ్రి ఈదప్పతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురు కాసేపు వాదించుకున్న తర్వాత శ్రీశైలం తన తండ్రి ఈదప్పను కాలుతో తన్నడంతో, కోపంతో తండ్రి అందుబాటులో ఉన్న కర్రతో కొడుకు శ్రీశైలాన్ని తలపై కొట్టాడు. దీంతో తల పగిలి శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళనకు గురైన తండ్రి ఈదప్ప అక్కడి నుండి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నాగారం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న తండ్రి ఈదప్ప కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   


logo