సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 20:04:49

మంచిర్యాల జిల్లాలో విషాదం..విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం..విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలంలోని బెజ్జాల గ్రామంలో ఇంట్లో విద్యుత్ రావడం లేదని వైర్లు సవరిస్తున్న క్రమంలో.. విద్యుత్ షాక్ తగిలి బద్రి రవి (35) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఉదయం పొలానికి మందుకొట్టి వచ్చిన రవికి కుటుంబ సభ్యులు ఇంట్లో కరెంట్ సరఫరా లేదని తెలపడంతో వైర్లను సవరిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆటోలో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మాలతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo