సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 20:02:15

ఖమ్మం జిల్లాలో విషాదం..నదిలో పడి వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లాలో విషాదం..నదిలో పడి వ్యక్తి మృతి

ఖమ్మం :  పశువులు నదిలోకి వెళ్లిన పశువులను తోలుకరావడానికి వెళ్లిన పశువుల కాపరి నదిలో పడి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. డాక్యా తండాకు చెందిన మలోతు శంకర్ (55)  బుధవారం సాయంత్రం మున్నేటి నది లో గల్లంతయ్యాడు. పశువులు కాస్తుండగా అవి ముందే నది లోకి వెళ్లాయి. వాటిని తోలుకరావడానికి నదిలో దిగటంతో అనుకోకుండా లోతులో పడటంతో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo