శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 14:41:08

విధి నిర్వహణలో విషాదం..గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి

విధి నిర్వహణలో విషాదం..గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి

సంగారెడ్డి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి  పట్టణం సాయినగర్ కాలనీలో చోటుచేసుకున్నది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రయ్య (40) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి  భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్రయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాగా, వీరి స్వస్థలం జిల్లాలోని ఆందోలు మండలం కాంసంపల్లి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దావాఖానకి తరలించారు.


logo