శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 19:05:07

విహారంలో విషాదం..జలపాతంలో పడి యువతి మృతి

విహారంలో విషాదం..జలపాతంలో పడి యువతి మృతి

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారం వారి కుటుంబంలో విషాదాన్నినింపింది. సెలువు రోజు కుటుంబంతో సరదాగా గడుపుదామని జలపాత సందర్శనకు వెళ్లిన వారి కుటుంబానికి తీరని శోకమే మిగిలింది. పోలీసుల కథనం మేరకు..బయ్యారం మండలం చింతోని గుంపు గ్రామ సమీపంలోగల వంక మడుగు జలపాతం సందర్శన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన అంబటి పూజిత (18) అనే యువతి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించింది.

బయ్యారం సీఐ తిరుపతి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు దయచేసి పర్యాటకులు ఎవరు కూడా జలపాత సందర్శనకు రావొద్దని పోలీసులు సూచించారు. కాగా, పూజిత వెటర్నరీ పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఎదిగి వచ్చిన బిడ్డ కండ్లముందే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల శోకం పలువురిని కంటతడి పెట్టించింది.


logo